Saturday, July 2, 2011

శివ శంభో శివ


నాడు గంగను నిలువరించి నియంత్రించ
ఝటాధారియై హిమనగాలపై నిలిస్తే
నేడు
ఝటాఝూటం గాలికి చెదిరిపోగా
ఫణీంద్రుడు బుసలు కొడుతూండగా
భూనభోంతరాలు దద్దరిల్లేలా
ఢమరుకాన్ని మ్రోగిస్తూ
త్రిశూలాన్ని ఝళిపిస్తూ
అవినీతిని దునుమాడ
ఆశ్రిత పక్షపాతుల పీచమడచ
అక్రమ సంపాదనాపరుల అణగ దొక్క
నందివాహనంపై
వస్తున్నాడు మహాశివుడు
మహోగ్రంగా మన లోకానికి . . . . . .

నా మిత్రుడు నరేష్ చిత్రించిన పై మహాశివుని చిత్రాన్ని చూసినపుడు నాలో కలిగిన భావ సంచలనానికి అక్షర రూపం ఇది.

ఆచార్యునికి ఆశ్రునివాళి


తెలంగాణ పోరాట చరిత్రలో
మీరో భీష్మాచార్యులు.
మహాత్ముని సత్యాగ్రహం
నేతాజి వ్యూహరచన
కలగలసిన మీ వ్యక్తిత్వం
మీ మూర్తిమత్వం
ఈ తెలంగాణ పోరాట నావకు
చుక్కానియై నడిపించి
అర్ధాంతరగా వెళ్ళిపోయారా
ఆచార్యా
మూగవోయిన మీ గొంతు సాక్షిగా,
ఆగిపోయిన మీ గుండె ఆనగా
చెబుతున్నాం .....
ఈ పోరాటం ఇక ఆగదు,
సాగుతూనే ఉంటూంది
తెలంగాణ సాధించేదాకా.