Saturday, July 2, 2011

శివ శంభో శివ


నాడు గంగను నిలువరించి నియంత్రించ
ఝటాధారియై హిమనగాలపై నిలిస్తే
నేడు
ఝటాఝూటం గాలికి చెదిరిపోగా
ఫణీంద్రుడు బుసలు కొడుతూండగా
భూనభోంతరాలు దద్దరిల్లేలా
ఢమరుకాన్ని మ్రోగిస్తూ
త్రిశూలాన్ని ఝళిపిస్తూ
అవినీతిని దునుమాడ
ఆశ్రిత పక్షపాతుల పీచమడచ
అక్రమ సంపాదనాపరుల అణగ దొక్క
నందివాహనంపై
వస్తున్నాడు మహాశివుడు
మహోగ్రంగా మన లోకానికి . . . . . .

నా మిత్రుడు నరేష్ చిత్రించిన పై మహాశివుని చిత్రాన్ని చూసినపుడు నాలో కలిగిన భావ సంచలనానికి అక్షర రూపం ఇది.

ఆచార్యునికి ఆశ్రునివాళి


తెలంగాణ పోరాట చరిత్రలో
మీరో భీష్మాచార్యులు.
మహాత్ముని సత్యాగ్రహం
నేతాజి వ్యూహరచన
కలగలసిన మీ వ్యక్తిత్వం
మీ మూర్తిమత్వం
ఈ తెలంగాణ పోరాట నావకు
చుక్కానియై నడిపించి
అర్ధాంతరగా వెళ్ళిపోయారా
ఆచార్యా
మూగవోయిన మీ గొంతు సాక్షిగా,
ఆగిపోయిన మీ గుండె ఆనగా
చెబుతున్నాం .....
ఈ పోరాటం ఇక ఆగదు,
సాగుతూనే ఉంటూంది
తెలంగాణ సాధించేదాకా.

Saturday, June 25, 2011

వాన

కార్తెలు మారుతున్నా
కరిమబ్బులు కరుణించక
కరిగిపోయి
కన్నీళ్ళే మిగిల్చాయి

వ్యవసాయం

వ్యయం అయితే ఘనం
సాయం అయితే శూన్యం

Tuesday, June 7, 2011

పునః ప్రవెశం

చాన్నాళ్ళ తరువాత పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆలస్యానికి అనేకానేక క్షమాపణలు.

Friday, March 13, 2009

TELUGU SMSs

1. Ushodayana baala bhaanuni leletha kiranaalu pudami thallini muddade samayana, nesthama neeku shubhodayam

2. thurpu kondapainundi dinakarudu tharu shaakhala gunda thana bangaaru kiranaalni prasarimpa chese vela, nesthama anduko naa ushodaya shubhaakaankshalu

3. Vasantha maasa prarambha velalo lemaavi chigullapai nundi kokila chese kuhu kuhu raavaalni vintuu ee dinaaniki swagatham palukavaa nestham.

vikasinchina poola parimalam
mathu goluputhunte
parimalinchina mana sneha sowrabham
padikaalaalapatu padilanga untundi

Monday, August 18, 2008

Chirunavvu (Smile)

A curve on your lips, make so many things straight

Wednesday, February 27, 2008

కాంతి దీపాలు

తూరుపు నింగిలో
అరుణ భాస్కరుడుదయిస్తున్నాడు
లోకంలోని కల్మషాన్ని కాల్చి వేయడానికి

నీలాల నింగిలో
చిన్నారి జాబిలి
చల్లని వెన్నెలను ప్రసరిస్తుంది
తనలోని మంచిని అందరికి పంచేలా

ఆకాశ వీధిలో అందాల తారలు
తళుకు తళుకు మంటున్నాయి
మనుషుల్లోని తమస్సును హరించేలా

ఆ అరుణ భాస్కరుడు
ఆ చిన్నారి జాబిలి
ఆ అందాల తారలు

ఇస్తున్నాయి మనకో సందేశాన్ని
ఇతరులకు సహాయ పడేలా
నీ జన్మను సార్థకం చేసుకో అని

Tuesday, February 19, 2008

విప్లవం (12 జనవరి 1975లో వ్రాసినది)

దారిద్ర్యం .....
తాండవిస్తుంది,
నిర్భాగ్యం .....
గాలిలా వీస్తూంది.

ఎక్కడి నుండో
విప్లవం అనే అగ్ని కణం
దగద్దాయమానంగా
ప్రకాశాల్ని నలువైపులా విరజిమ్ముతూ
వచ్చి ఆ కూటమిలో పడిందట

నీ, నా
అనే బేదం లేకుండా
ఆ అగ్ని కణం
దారిద్ర్యాన్నీ, ధనాన్నీ
కాల్చిపారేసిందట.

Friday, February 15, 2008

నేను సూర్యున్ని (ఇది వేదం కవిత)

సూర్యున్ని ...

చీకటి మబ్బులు కమ్మి ...
నన్ను మింగేసినా ...
నేను సూర్యున్ని

కొంగ్రొత్త కిరణాల్ని విరజిమ్ముతూ ...
రేపు వుదయం ...
కొత్త ఆశల వెలుతురులతో ...
మళ్ళీ విచ్చుకుంటాను.

************************

నా అరుణారుణ కాంతులతో
ఫుడమి తల్లికి
కొత్త కాంతుల్నిస్తాను ...
సరికొత్త ఆశల్ని కల్పిస్తాను.