Monday, August 18, 2008

Chirunavvu (Smile)

A curve on your lips, make so many things straight

Wednesday, February 27, 2008

కాంతి దీపాలు

తూరుపు నింగిలో
అరుణ భాస్కరుడుదయిస్తున్నాడు
లోకంలోని కల్మషాన్ని కాల్చి వేయడానికి

నీలాల నింగిలో
చిన్నారి జాబిలి
చల్లని వెన్నెలను ప్రసరిస్తుంది
తనలోని మంచిని అందరికి పంచేలా

ఆకాశ వీధిలో అందాల తారలు
తళుకు తళుకు మంటున్నాయి
మనుషుల్లోని తమస్సును హరించేలా

ఆ అరుణ భాస్కరుడు
ఆ చిన్నారి జాబిలి
ఆ అందాల తారలు

ఇస్తున్నాయి మనకో సందేశాన్ని
ఇతరులకు సహాయ పడేలా
నీ జన్మను సార్థకం చేసుకో అని

Tuesday, February 19, 2008

విప్లవం (12 జనవరి 1975లో వ్రాసినది)

దారిద్ర్యం .....
తాండవిస్తుంది,
నిర్భాగ్యం .....
గాలిలా వీస్తూంది.

ఎక్కడి నుండో
విప్లవం అనే అగ్ని కణం
దగద్దాయమానంగా
ప్రకాశాల్ని నలువైపులా విరజిమ్ముతూ
వచ్చి ఆ కూటమిలో పడిందట

నీ, నా
అనే బేదం లేకుండా
ఆ అగ్ని కణం
దారిద్ర్యాన్నీ, ధనాన్నీ
కాల్చిపారేసిందట.

Friday, February 15, 2008

నేను సూర్యున్ని (ఇది వేదం కవిత)

సూర్యున్ని ...

చీకటి మబ్బులు కమ్మి ...
నన్ను మింగేసినా ...
నేను సూర్యున్ని

కొంగ్రొత్త కిరణాల్ని విరజిమ్ముతూ ...
రేపు వుదయం ...
కొత్త ఆశల వెలుతురులతో ...
మళ్ళీ విచ్చుకుంటాను.

************************

నా అరుణారుణ కాంతులతో
ఫుడమి తల్లికి
కొత్త కాంతుల్నిస్తాను ...
సరికొత్త ఆశల్ని కల్పిస్తాను.

Wednesday, February 13, 2008

రాతి లోని అందం




రాయిని అందంగా మలచిన ఆ ప్రకృతి ప్రతిగా మననేం అడుగుతుంది. మనం ఎంత డబ్బు పోసి ఏ అందాన్ని కొనగలం ? తయారు చేయగలం ? అందుకే ప్రకృతిని పరిరక్షిద్దాం.

Tuesday, February 12, 2008

Friday, February 8, 2008

ప్రియురాలు

తీయని నా రంగి
పెదవి ఇప్పిందంటె
గల గలా రాల్తాయి
ముతియాల మాటలు

సక్కని నా రంగి కదలి
ఒచ్చిందంటె కలహంస
సిగ్గుతో సిరము ఒంచిందంట

కమ్మని నా రంగి
పాట పాడిందంటె
లేడి పిల్లలొచ్చి గంతులేసాయంట
నెమళ్ళు పురి ఇప్పి నాట్యమాడాయంట
కోయిల తన కూత మరసి పోయిందంట

కోక నడుముకు సుట్టి
కొడలి చేపట్టిన
కోమలి నా రంగి
కోటి అందాల వెల్గు

Wednesday, February 6, 2008

ఆరు బయట వాకిట్లో వేప చెట్టు క్రింద నాన్నగారి వాలు కుర్చి తెచ్చుకుని పిల్లగాలుల్నాస్వాదిస్తూ సేదదేరుతూన్న వేళ, నా ప్రక్కనే సగం తిని నేలపై వదిలేసిన జామపండును ఎక్కదినుండో చూసి వచ్చిన ఉడుత, నన్ను చూసి సందేహిస్తూ ఆగి పోయింది. కనకాంబరం మొక్కపై ఓ చిన్ని పక్షి గూడు కట్టుకొని బయటకు,లోనికి వెళుతూ హడావుడి పదిపోతూంది. ఇంటి వెనకాల తాటి చెట్ల మద్య నుండి అస్తమించే సూరీడు సంధ్యారుణ కాంతుల్ని వెలువరిస్తూ యింటికేగే తొందరలో ఉన్నాడు. వీటన్నిటినీ చూస్తూ మైమరచిపోతూన్న నాకు రోజూ కనిపించే మరో ద్రుశ్యం మళ్ళీ సాక్షాత్కరించింది. సాయంసమయంలో కల్లు మండవ నుండి కల్లు తాగి వచ్చే జనం, వారి నడక, వారి పాటలుపాటలు, రోజూ చూస్తున్నవే అయినా మళ్ళీ, మళ్ళీ చూడాలనిపిస్తాయి. కల్లు తాగడానికి చెప్పులుకుట్టె ముత్తయ్య తాత రోజూ మా ఇంటిముందునుండే దారంట వేగంగా వెళతాడు. ఎవరేనా ఏంటి బావా ? అని పలకరిస్తే ఆగకుండా వడి వడిగా ఎక్స్ ప్రెస్ లా వెళ్ళిపోతాడు. కల్లు మండవ నుండి వచ్చేప్పుడు మాత్రం ప్రతి పది అడుగులకు ఆగి, ఆగి అందరినీ ఆపి వాగుతూ, వదరుతూ తిరిగి వస్తాడు. రోజూ ఈ ద్రుశ్యం చూడ్డం నాకలవాటయినా ప్రతి రోజూ కొత్తే - ప్రతి రోజూ వింతే. ఇప్పటికీ ఈ అనుభూతులు పదిలంగా మదినిండా బద్రంగా ఉన్నాయి.

MY VILLAGE 1965

My village situated in Karimnagar District. I have spent entire schooling in this village. Being a member of an agricultural family have been in the agricultural fields with my family members. I like the smell of soil when rain starts. Beautiful landscapes, hillocks, small river with small small fishes, green fields still fresh in my mind. Harikathas, folk song still ringing in my ears. Janani Janma Bhumishcha Swarga Dapee Gareeyasi - I like my village where I learn walking, talking, playing, singing, swimming and what not. My mother tongue is telugu, still I am poor, poorer, poorest in english. Next posts will be in telugu, which one may like it. My school, my schoolmates, classmates, play ground, even the thought of these things are delighting me. Now, everything commercialised and polluted, I am not dare enough to go to my village now a days. But still I like it, I love it. again I want to go back to 1965 to 1969.